సంబంధిత వార్తలు

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తాజా
సమాచారం. కొన్నిరోజుల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు
కరోనాతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. అప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని
కోలుకొన్న తరువాత ఇంటికి తిరిగి వచ్చారు. కానీ మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో
కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఊపిరితీసుకోవడానికి
చాలా ఇబ్బంది పడుతుండటంతో ప్రస్తుతం ఆయనను వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.