
దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సోలిపేట సుజాత బుదవారం ఉదయం నామినేషన్ వేశారు. మంత్రి హరీష్రావు, ఎంపీ ప్రభాకర్లతో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను. కనుక ప్రజలాందరూ నాకే ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. వారిరువురూ ఇంకా నామినేషన్ వేయవలసి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉంది. అక్టోబర్ 17 నామినేషన్ల పరిశీలించబడతాయి. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, 10వ తేదీన ఓట్ల లెక్కించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.