
జీహెచ్‌ఎంసీ చట్టాలలో కొని సవరణలు చేసేందుకు మళ్ళీ ఈ నెల 12,13 తేదీలలో కేవలం రెండు రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కార్యలయం (సీఎంఓ) ఈ విషయం స్వయంగా ట్విట్టర్ ద్వారా ఇవాళ్ళ మధ్యాహ్నం తెలియజేసింది.
ఇటీవల ముగిసిన శాసనసభ వర్షాకాల సమావేశాలలో కొత్త రెవెన్యూ చట్టంతో సహా హైకోర్టు సూచనల మేరకు కొన్ని చట్ట సవరణలు చేసి ఆమోదించిన తరువాత నిరవదికంగా వాయిదా పడ్డాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయడానికి శాసనసభ ఆమోదం అవసరం లేదు కనుక ఇప్పుడు చేయబోయే చట్ట సవరణలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఏమైనా సంబందం ఉంటుందా లేదా అనే విషయం త్వరలో తెలుస్తుంది.