బాబ్రీ కేసులో అందరూ నిర్ధోషులే: సిబిఐ తుది తీర్పు

గత 28 ఏళ్ళుగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై విచారణ జరుగుతోంది. లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుదవారం ఆ కేసుపై తుది తీర్పు వెల్లడించింది. సిబిఐ న్యాయమూర్తి జస్టిస్ సురేంద్రకుమార్ యాదవ్ 2,000 పేజీల తుది తీర్పును చదివి వినిపిస్తూ, “ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమా భారతితో సహా మొత్తం 32 మంది నిందితులు నేరపూరితమైన కుట్రకు పాలపడినట్లు ఎటువంటి ఆధారాలు లేనందున వారిపై మోపబడిన అభియోగాలు ఈ కోర్టు కొట్టివేస్తోంది. వారిని సిబిఐ దోషులని సిబిఐ నిరూపించలేకపోయినందున అందరినీ నిర్ధోషులుగా కోర్టు ప్రకటిస్తోంది,” అని అన్నారు. 

బాబ్రీ మసీదు కూల్చివేసినందుకే తీవ్ర ఆగ్రహంతో ఉన్న దేశంలో ముస్లింలకు ఈ తీర్పు మానుతున్న వారి పుండుపై మళ్ళీ కారం జల్లినట్లే అవుతుంది. ఈ తీర్పుపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నేడే ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.