శాసనసభ సమావేశాలు నిరవదిక వాయిదా

శాసనసభ, మండలి సమావేశాలు నిరవదికంగా వాయిదా పడ్డాయి. శాసనసభ సమావేశాలకు హాజరైన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలకు, 13 మంది సిబ్బందికి కరోనా సోకింది. అదీగాక ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టదలచిన 12 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. సర్వత్రా కరోనా వైరస్‌ పొంచి ఉన్నందున శాసనసభ సమావేశాలను వాయిదా వేయడమే మంచిదనే బీఏసీ సూచన మేరకు సమావేశాలను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.