సెప్టెంబర్ 28వరకు శాసనసభ సమావేశాలు

ఇవాళ్ళ ఉదయం శాసనసభ, మండలి సమావేశాలు ముగియగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసి) సమావేశమై శాసనసభ పనిదినాలు, శలవులు, సభలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేశారు. ఈ నెలలో 12,13,20,27 తేదీలలో ఉభయసభలకు శలవులు ఉంటాయి. ఈనెల 28 వరకు మొత్తం 18 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. శాసనసభలో గంటసేపు ప్రశ్నోత్తరాలు, అర్ధగంటసేపు జీరో అవర్ ఉంటాయి.  ఈనెల 10,11 తేదీలలో కొత్త రెవెన్యూ చట్టంపై ఉభయసభలలో చర్చించి ఆమోదిస్తారు.