
ప్రణబ్ ముఖర్జీ 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీర్బూమ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం మిరాఠీలో జన్మించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఎంఏ, ఎల్ఎల్బీ, డీ.లిట్ చేసిన ఉన్నత విద్యావంతుడు. కనుక ఓ స్కూలు టీచరుగా జీవితం ప్రారంభించి తరువాత జర్నలిస్టు అవతారం ఎత్తారు. అదే ఆయన రాజకీయాలలోకి బాటలు పరిచింది. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా 1975,1981, 1993,1999లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1973లో ఇందిరా గాంధీ హయాంలో కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరైనప్పుడు, అనుకోకుండా ఆయనకు సహాయమంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలలో అనేకసార్లు వివిద శాఖల మంత్రి పదవులు చేపట్టి ఎంతో సమర్ధంగా నిర్వహించారు. 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి 2017, జూలై 25వరకు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీకి, ఆయనకు మంచి సత్సబంధాలు కొనసాగాయి. చివరికి 2017లో పదవీ విరమణ చేసినప్పుడు మోడీ ప్రభుత్వం ఆయనకు పార్లమెంటులో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికింది. ఆయన ఎంతో శ్రమించి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నతస్థాయికి చేరుకొని ఆద్యంతం నిండైన జీవితం గడిపి చాలా ప్రశాంతంగా ముగించారు.