.jpg)
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ కొద్ది సేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె తన రాజీనామా లేఖను సమర్పించగా, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆ లేఖను సభ్యులకు చదివి వినిపించారు. తాను ఇక ఎంత మాత్రం పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగలేనని కనుక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న నేతలకు ఆమె విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆ పదవి చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై జోరుగా చర్చిస్తున్నారు. మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరో తెలిసే అవకాశం ఉంది.