సంబంధిత వార్తలు

శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులతో సహా డీఈ, ఏఈ స్థాయి అధికారులు మొత్తం 9 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు సిఎం కేసీఆర్ నష్టపరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఏఈ స్థాయి అధికారులతో సహా మిగిలిన వారందరి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. దానితో పాటు ఒక్కో కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని సిఎం కేసీఆర్ చెప్పారు.