సంబంధిత వార్తలు
8.jpg)
శ్రీశైలం అగ్నిప్రమాదాన్ని చాలా తీవ్రంగా భావించిన సిఎం కేసీఆర్ దానిపై సిఐడీ విచారణకు ఆదేశించారు. సిఐడి అధనపు డీజీ గోవింద్ సింగ్ను విచారణాధికారిగా నియమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ప్లాంటులో చిక్కుకుపోయిన 9 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. సహాయచర్యలు చేపట్టిన సీఐఎస్ఎస్ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాయి. మిగిలిన ముగ్గురి కోసం లోపల గాలిస్తున్నారు.