వచ్చే నెల శాసనసభ సమావేశాలు ఖరారు

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరపాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇవాళ్ళ ప్రగతి భవన్‌లో మంత్రులతో సమావేశమయ్యి శాసనసభ సమావేశాల గురించి చర్చించారు. ఈసారి కనీసం 15 నుంచి 20 రోజులు పనిదినాలు ఉండేవిధంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి శాసనసభలో ప్రవేశపెట్టవలసిన బిల్లులు, చర్చించాల్సిన అంశాల గురించి చర్చించనున్నారు. కరోనా నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ సమావేశాలు నిర్వహించవలసి ఉంటుంది కనుక దాని కోసం శాసనసభ, మండలిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. సమావేశాల తేదీ ఖరారు అయ్యింది కనుక ఆలోగా ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తారు.