తెలంగాణ బంద్‌కు పిలుపిచ్చిన మావోయిస్టులు

మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్న విరసం నేత వరవరరావుకు కరోనా సోకడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ తక్షణం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. తక్షణం ఆయనపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేసి ఆయనను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఓ లేఖ ద్వారా కోరింది. అలాగే నల్లమల అడవులలో తమ కోసం గాలిస్తున్న గ్రేహౌండ్ దళాలను ప్రభుత్వం వెంటనే వెనక్కు రప్పించాలని డిమాండ్ చేశారు.