
ముంబై తలోజా జైలులో ఉన్న విరసం నేత వరవరరావుకు కరోనా సోకింది. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జైలు అధికారులు ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు జరిగిన కుట్రలో ఆయనకు కూడా పాత్ర ఉందనే ఆరోపణలతో సుమారు రెండేళ్ల క్రితం అరెస్ట్ చేసి ముంబైకి తరలించి జైలులో ఉంచారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం చాలాసార్లు ప్రయత్నించారు కానీ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు, ఆయన స్నేహితులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణం బెయిల్‌పై మంజూరు చేసి విడిచిపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వానికి లేఖలు వ్రాసి కోరారు.