తెలంగాణలో భారీగా ఐఎఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో భారీగా ఐఎఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ బుదవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని అటవీశాఖకు బదిలీ చేయడం, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగం కమీషనర్ యోగితా రాణాను సాంఘిక సంక్షేమశాఖకు బదిలీ చేయడం విశేషం. 

శాంతికుమారి స్థానంలో ప్రస్తుతం డిల్లీలో తెలంగాణ భవన్‌లో ఓఎస్డీగా చేస్తున్న సయ్యద్ అలీ మూర్తుజా రజీని, యోగితారాణా స్థానంలో వాకాటి అరుణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరెవరు ఎక్కడికి బదిలీ అయ్యారంటే...        

వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి: సయ్యద్ అలీ మూర్తుజా రజీ

ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగం కమీషనర్: వాకాటి అరుణ

అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: శాంతి కుమారి 

సాంఘిక సంక్షేమశాఖ కమీషనర్: యోగితా రాణా

సాంఘిక సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి: విజయ్ కుమార్ 

సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి: రాహుల్ బొజ్జ (కొనసాగింపు)

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి: ఈ. శ్రీధర్

గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: రాణి కుముదిని దేవి

పర్యావరణ, శాస్త్ర సాంకేతిక విభాగం బాధ్యతలు: రజత్ కుమార్ 

ఈపీఈఆర్‌ఐ డైరెక్టర్: అదర్ సిన్హా

పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి: కెఎస్. శ్రీనివాస్ రాజు 

పాఠశాల విద్యా డైరెక్టర్: శ్రీదేవసేన 

కలక్టర్ల బదిలీలు: 

సిక్తా పట్నాయక్: అదిలాబాద్ జిల్లా కలక్టర్ 

భారతీ హోలీకేరీ: పెద్దపల్లి జిల్లా ఇన్‌-చార్జ్ కలక్టర్

ఎల్ఎన్‌ శర్మ: నాగర్ కర్నూల్ జిల్లా కలక్టర్