మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. సరిహద్దులో చైనాతో ఘర్షణలు, వాటిలో 21 మంది సైనికుల మరణాలు, చైనా యుద్ధసన్నాహాలు, చైనాను కట్టడి చేయడానికి చేపడుతున్న చర్యలు, రేపటి నుంచి ప్రారంభం అయ్యే అన్‌లాక్-2, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు, వాటి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలు, కరోనా జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడే అవకాశం ఉంది.
ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు, సరిహద్దులలో చైనా చేస్తున్న హడావుడి దేశప్రజలను కలవరపరుస్తునాయి. కనుక ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగంలో ప్రధానంగా వాటి గురించే ఎక్కువ మాట్లాడవచ్చు.