వరవరరావుకు బెయిల్‌ నిరాకరణ

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు బొంబే హైకోర్టు బెయిల్‌పై నిరాకరించింది. ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నారనే అభియోగంతో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) 2018లోవరవరరావును అరెస్ట్ చేసి మహారాష్ట్రకు తరలించింది. మొదట పూణేలోని ఎరవాడ జైలులో ఉన్న ఆయనను కొన్ని నెలల క్రితం నవీముంబైలోని తలోజా జైలుకు తరలించబడ్డారు. ఆయనను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే అనారోగ్యం పాలైనట్లు ఆయన కుమార్తెలు చెపుతున్నారు. తమ తండ్రికి బెయిల్‌పై ఇవ్వాలంటూ వరవరరావు కుమార్తెలు వేసిన పిటిషన్‌పై బొంబే హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అయితే భీమా కోరేగావ్ కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్న వరవరరావుకు బెయిల్‌ ఇవ్వవద్దని ఎన్ఐఏ అభ్యర్ధన మేరకు బెయిల్‌పై పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన కుమార్తెలు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారు.