లవ్ అగర్వాల్ నేడు హైదరాబాద్‌ పర్యటన

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న జాగ్రత్తలు, ఇకపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించేందుకు ఆయన వస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఇకపై కరోనా పరీక్షలను మరింత పెంచవలసిందిగా కోరబోతున్నట్లు సమాచారం.  అందుకు అవసరమైన సహాయసహకారాలను అందజేసేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ అగర్వాల్‌తో పాటు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖకు చెందిన మరికొందరు అధికారులు కూడా నేడు హైదరాబాద్‌కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.