సంబంధిత వార్తలు

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు ఓ శుభవార్త! జూలై 1వ తేదీన చెల్లించబడే జూన్ నెల జీతాలు, పెన్షన్లలో ఎటువంటి కోతలు విధించకుండా ఈసారి పూర్తి జీతాలు, పింఛన్లు చెల్లించాలని సిఎం కేసీఆర్ ఆర్ధికశాఖను ఆదేశించారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. పరిస్థితులు మరికొంత మెరుగుపడగానే గత రెండు నెలలో కోత విధించిన జీతాలు, పెన్షన్లను కూడా చెల్లించవచ్చు.