ప్రభుత్వోద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ

రాజధాని హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నందున రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పనిచేసే ప్రభుత్వోద్యోగుల కోసం ఈరోజు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఈ నెల 22 నుంచి జూలై 4వరకు అమలులో ఉంటాయని తెలిపింది.  

ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలలో 50 శాతం మంది సిబ్బంది మాత్రమే రొటేషన్ పద్దతిలో విధులకు హాజరుకావాలి. అయితే ప్రత్యేకంగా ఛాంబర్లు కలిగినవారు యధాప్రకారం ప్రతీరోజు విధులకు హాజరుకావాలి.  తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌లో పని చేస్తున్న క్లాస్-4 ఉద్యోగులు వారం రోజుల రొటేషన్ ప్రకారం విధులకు హాజరవుతుండాలి. బీపీ, డయాబెటీస్ వంటి దీర్గకాలిక ఆరోగ్యసమస్యలున్న ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలు తమ శలవులను ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ క్వార్టర్స్ లో నివశిస్తున్న ఉద్యోగులలో డ్యూటీలో లేనప్పుడు క్వార్టర్స్ బయట తిరగరాదు. అధికారుల కారు డ్రైవర్లు పార్కింగ్ స్థలాలలో కాకుండా సదరు అధికారి పేషీలోనే ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతిలేనిదే సందర్శకులను కార్యాలయాలలోకి అనుమతించరాదు.