
లడక్‌లోని గాల్వామా లోయ వద్ద ఈ నెల 15రాత్రి చైనా సైనికులు జరిపిన దాడిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ కుమార్‌తో సహా మొత్తం 20 మంది జవాన్లు మరణించారని భారత్ ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో మరో 76 మంది జవాన్లకు గాయాలయ్యాయని భారత్ ఆర్మీ గురువారం ప్రకటించింది. వారిలో 56 మంది వివిద ఆసుపత్రులలో, మిగిలిన 20 మంది లేహ్‌లోని ఆసుపత్రిలో చికిత్స చికిత్స పొందుతున్నారని అందరూ మరో రెండు వారాలలో మళ్ళీ విధులలో చేరుతారని తెలిపింది. కొంతమంది భారత్ జవాన్లు చైనా నిర్బందంలో ఉన్నారని మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆర్మీ ఖండించింది. సరిహద్దుల వద్ద జరిగిన ఘర్షణలలో ఎవరూ తప్పిపోలేదు. మొత్తం 20 మంది జవాన్లు చనిపోయారు 76 మంది గాయపడ్డారు. గాయపడినవారందరూ కొలుకొంటున్నారు. కనుక ఇటువంటి తప్పుడు కధనాలు ప్రసారం చేయవద్దని భారత్ ఆర్మీ మీడియాకు విజ్ఞప్తి చేసింది.