డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా?

ఆమాద్మీ పార్టీ అధినేత, డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈరోజు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆస్త్మా వ్యాధితో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిన్నటి నుంచి దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే గృహనిర్బందంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటి రిపోర్టు ఈరోజు రాత్రిలోగా వెలువడే అవకాశం ఉంది. 

దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా డిల్లీలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనాను అడ్డుకోవడానికి ఆమాద్మీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో పెరుగుతున్న కరోనా కేసులను చూసి డిల్లీ ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా మన జోలికి రాదని అరవింద్ కేజ్రీవాల్‌ చెప్పారు చివరికి ఆయనే దాని బారిన పడినట్లున్నారు,