కేసీఆర్‌కు ఇప్పుడు ఆ నొప్పి తెలుస్తోందా? విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి సిఎం కేసీఆర్‌పై ఫేస్‌బుక్‌లో ఘాటుగా విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పేరుతో ప్రతిపక్షాల మెడపై కత్తిపెట్టి లొంగదీసుకొన్న సిఎం కేసీఆర్‌కు, ఇప్పుడు ఆదేపేరుతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మెడపై కత్తి పెట్టడంతో సిఎం కేసీఆర్‌కు ఆ నొప్పి తెలుస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీపై కేసీఆర్‌ స్పందన అయోమయంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం సంస్కరణలను విమర్శిస్తూనే మళ్ళీ కేంద్రం ప్రతిపాదించిన ‘వన్ నేషన్ వన్ రేషన్’ పధకాన్ని దేశంలో అందరికంటే ముందు మేమే అమలుచేశామని సిఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. కేసీఆర్‌ గురించి విజయశాంతి ఏమన్నారో ఆమె మాటలలోనే...