
పొరుగు రాష్ట్రం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,000 దాటింది. గడిచిన 24 గంటలలో 9,628 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 48 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారిలో 31 మంది చెన్నైలోని కరోనా ప్రభావిత కోయంబెడ్ మార్కె ట్‌కు వెళ్ళివచ్చినవారే. ఇవి కాక ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తిరిగివచ్చిన వలస కార్మికులలో 150 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో మహారాష్ట్ర నుంచి వచ్చినవారిలో 101 మందికి, గుజరాత్ 26 మంది, రాజస్థాన్ 11 మంది, ఒడిశా 10 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినవారిలో ఒక వ్యక్తికి కరోనా సోకింది.
అయితే 101 పాజిటివ్ కేసులను వేరేగా చూపిస్తున్నందున, ఏపీలో నివశిస్తున్నవారిలో 2, 205 మందికి కరోనా పాజిటివ్ అని వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. శుక్రవారం ఒక వ్యక్తి మరణించడంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 49కి చేరింది.
ఇప్పటి వరకు 1,353 మంది కరోనా రోగులు కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్ళగా మరో 803 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు వారి సంఖ్య1,192 మందికి చేరింది. అంటే నమోదవుతున్న కేసుల కంటే కొలుకొంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం 860 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 48కి చేరింది.
ఏపీలో 13 జిల్లాలో కరోనా కేసుల తాజా పరిస్థితి ఈవిధంగా ఉంది:
|
జిల్లా |
కొత్త కేసులు |
పాజిటివ్ 14/5 |
డిశ్చార్జ్ 14/5 |
మృతులు 14/5 |
|
శ్రీకాకుళం |
0 |
7 |
4 |
0 |
|
విజయనగరం |
0 |
7 |
0 |
0 |
|
విశాఖ పట్నం |
4 |
72 |
26 |
1 |
|
తూర్పుగోదావరి |
0 |
52 |
77 |
0 |
|
పశ్చిమ గోదావరి |
1 |
70 |
48 |
0 |
|
కృష్ణా |
7 |
367 |
211 |
14 |
|
గుంటూరు |
9 |
413 |
257 |
8 |
|
ప్రకాశం |
0 |
63 |
63 |
0 |
|
కడప |
1 |
102 |
65 |
0 |
|
కర్నూలు |
9 |
608 |
390 |
19 |
|
నెల్లూరు |
9 |
149 |
81 |
3 |
|
చిత్తూరు |
8 |
173 |
77 |
0 |
|
అనంతపురం |
0 |
122 |
93 |
4 |
|
మొత్తం |
48 |
2,205 |
1,353 |
49 |
|
వలస కార్మికులు |
150 |
|||