
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కార్మికులను తీసుకువెళుతున్న ఒక ట్రక్ మరో ట్రక్కును డ్డీకొనడంతో 23 మంది వలస కార్మికులు ఘటనాస్థలంలోనే మరణించారు. మరో 30-40 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని ఔరయా అనే ప్రాంతంలో జరిగింది. బహుశః డ్రైవరు నిద్రమత్తులో ఉన్నందున ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినవారు, మృతులు రాజస్థాన్ నుంచి వస్తున్నారని వారిలో బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారున్నారని ఔరయా మేజిస్ట్రేస్ట్ అభిషేక్ సింగ్ చెప్పారు. గాయపడినవారినందరినీ సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.