బండి సంజయ్‌పై కేసు నమోదు

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా పలువురు బిజెపి నేతలపై పోలీసులు నిన్న కేసులు నమోదు చేశారు. నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలో పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతుల సమస్యలను తెలుసుకొనేందుకు వెళ్లారు. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించినందుకు  పెద్దవూర పోలీసులు వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “కరోనా సోకకుండా ఉండాలంటే అందరూ రోగనిరోధక శక్తి పెంచుకోవాలని అందుకు బత్తాయి వగైరా పళ్ళు తినాలని సిఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం బత్తాయిలు అవసరం కనుక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయవద్దని చెప్పారు. కానీ రాష్ట్రంలో పండిన బత్తాయిలను అమ్ముకొందామంటే కొనేనాధుడే కనిపించడం లేదు. బత్తాయిలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయవద్దని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలి. లేదా వాటిని అమ్ముకొనేందుకు రైతులకు అవసరమైన వెసులుబాటు కల్పించాలి,” అని అన్నారు.