పంట రుణాల మాఫీకి రూ.1,200 కోట్లు విడుదల

తెలంగాణలో పంట రుణాల మాఫీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజులలో ఈ సొమ్ము రైతుల ఖాతాలలో జమా అవుతుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. దీంతో రూ.25,000 వరకు ఉన్న రుణాలకు ఒకేసారి మాఫీ చేయబడతాయి. రూ.25,000 నుంచి లక్ష లోపు రుణాలు నాలుగు దశలలో మాఫీ చేయబడతాయని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారు.  

పంటరుణాల సొమ్ముతో పాటు రైతు బంధు పధకం కోసం రూ.7,000 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు చెప్పారు. వానాకాలం మొదలవక మునుపే ఈ సొమ్ము రైతుల చేతికి అందుతుందని చెప్పారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో 51 లక్షల మంది రైతులకు ప్రయోజనం పొందుతారు.