సంబంధిత వార్తలు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్ నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఎగురవేసారు. కరోనా...లాక్‌డౌన్ కారణంగా టిఆర్ఎస్ చరిత్రలో మొట్టమొదటిసారి నిరాడంబరంగా ఆవిర్భావదినోత్సవం జరుపుకోవలసి వచ్చింది. సిఎం కేసీఆర్ మొదట తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన తరువాత పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.