
దేశంలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కేంద్రప్రభుత్వం శుక్రవారం రాత్రి మరికొన్ని లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించింది. మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల పరిధిలో గల పట్టణాలలోని నాన్-హాట్ స్పాట్ నివాస ప్రాంతాలలో విడివిడిగా ఉండే కొన్ని దుకాణాలకు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపునిస్తునట్లు ప్రకటించింది. కానీ రిజిస్ట్రేషన్ కలిగిన దుకాణాలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. కిరాణా, ఎలక్ట్రికల్, స్టేషనరీ తదితర దుకాణాలకు మినహాయింపు లభించింది. స్థానిక అధికార యంత్రాంగం సూచనలు, ఆదేశాల ప్రకారమే వాటిని నిర్వహించుకోవలసి ఉంటుంది. మాస్కూలు ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి జాగ్రతల్లన్నీ విధిగా పాటించవలసి ఉంటుంది. ఒకే బ్రాండ్ వస్తువులు లేదా ఉత్పత్తులు అమ్మే దుకాణాలు, అనేక బ్రాండ్ల ఉత్పత్తులు అమ్మే సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ మే 3వ వరకు లాక్‌డౌన్‌లో ఉంటాయి. రెడ్ జోన్ హాట్ స్పాట్ ప్రాంతాలకు ఈ మినహాయింపులు వర్తించవని ఉత్తర్వులలో పేర్కొంది.