తెలంగాణలో క్వారంటైన్‌ గడువు మార్పు

కరోనాపై పోరాటం చివరిదశకు చేరుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి మరిన్ని కటినచర్యలు తీసుకొనేందుకు సిద్దమవుతోంది. వాటిలో భాగంగా ప్రస్తుతం 14 రోజులున్న క్వారంటైన్‌ గడువును ఒకేసారి రెట్టింపు చేస్తూ 28 రోజులుగా మార్చింది. కనుక ఇకపై కరోనా లక్షణాలున్నవారు అందరూ తప్పనిసరిగా 28 రోజులు క్వారంటైన్‌లో ఉండక తప్పదు. అలాగే ఇప్పటివరకు కరోనా అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఇకపై ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.