
ఇటీవల హోంమంత్రి మహమూద్ ఆలీ మీడియా ద్వారా ఇళ్ళలో దాకొన్న కరోనా రోగులను ఉద్దేశ్యించి, “రాష్ట్రంలో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. కనుక ఇంకా ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్లయితే తక్షణం బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవల కరోనా బారినపడి కోలుకొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, తన ప్రాణాలు కాపాడిన వైద్యులనే దేవుళ్ళుగా భావిస్తున్నానని అన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మనమందరం కూడా అలాగే గౌరవించాలి. కానీ వారి పట్ల కొందరు రోగులు అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు విన్నాను. అటువంటివారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకొంటాము,” అని హెచ్చరించారు.