
కేంద్రప్రభుత్వం వచ్చే నెల 3వరకు లాక్‌డౌన్ పొడిగించినప్పటికీ కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏప్రిల్ 20 వ తేదీ నుంచి కొన్ని సంస్థలు, వ్యవస్థలకు ఆంక్షలు, షరతులతో కూడిన సడలింపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్నిటికి లాక్‌డౌన్ ఆంక్షల నుంచి సడలింపునిస్తూ కేంద్రహోంశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కానీ రెడ్ జోన్లు, హాట్ స్పాట్ ప్రాంతాలకు ఈ సడలింపులు వర్తించవని స్పష్టం చేసింది.
1. హౌసింగ్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్, కోపరేటివే క్రెడిట్ సొసైటీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
2. గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణరంగం, దానితో ముడిపడున్న నీటి సరగరా, పారిశుద్యం, విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ కేబుల్స్ తయారీకి అనుమతి.
3. అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటి ప్రాసెసింగ్, చిన్న తరహా టింబర్ డిపోలకు అనుమతి.
4. కొబ్బరికాయలు, వెదురు, సుగంధ ద్రవ్యాల సేకరణ, ప్రాసెసింగ్, అమ్మకాలు, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
ఇంతకు మునుపు ప్రకటించిన మినహాయింపులకు సంబందించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://www.mytelangana.com/telugu/editorial/20669/