సంబంధిత వార్తలు
తెలంగాణ రాష్ట్రంలో 74 లక్షలమందికి పింఛన్లు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1,112 కోట్లు బ్యాంకులకు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కష్టకాలంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలబడుతూ ఒక్కొక్కరికీ రూ.1,500 పింఛన్ అందజేస్తోందని చెప్పారు. లబ్దిదారుల ఖాతాలలో నేడే ఆ సొమ్ము జమా చేయబడుతుందని చెప్పారు. రాష్ట్రంలో తెల్లారేషన్ కార్డుల ద్వారా 76 లక్షల మందికి ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం కూడా అందించినట్లు తెలిపారు. సుమారు 87 శాతం మంది పేదలకు సుమారు 3 లక్షల టన్నుల బియ్యం పంపిణీ కార్యక్రమం పూర్తయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.