శనివారం మధ్యాహ్నం తెలంగాణ క్యాబినెట్ సమావేశం

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, లాక్‌డౌన్‌ పొడిగింపు, నిత్యావసర సరుకుల సరఫరా, లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు, ఉపాది, ఆదాయం కోల్పోయిన పేదప్రజలకు అందించవలసిన సహాయసహకారాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్‌ ముగుస్తుంది కనుక దానికి మూడు రోజుల ముందుగా జరుగుతున్న ఈ మంత్రివర్గ సమావేశం చాలా కీలకమైనదిగానే భావించవచ్చు.