తెలంగాణ ప్రజాప్రతినిధులు భారీ విరాళం

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.500 కోట్లు విరాళం అందజేయడానికి సమ్మతి తెలుపుతూ ముఖ్యమంత్రికి ఒక లేఖ అందజేశారు. దీనికోసం వారు తమ ఒక నెల వేతనాన్ని, నియోజకవర్గాల అభివృద్ధి కోసం తమకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను అందజేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు కె కేశవరావు, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు తదితరులు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంగీకారపత్రం అందజేశారు.