కేంద్రకమిటీకి ఎంపికైన టిఆర్ఎస్‌ ఎంపీ సంతోష్

టిఆర్ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. 22 మందితో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు వీలుగా వాటి ఆదాయవ్యయ ఖాతాలను మదింపు చేసి కేంద్రప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది. ఆ కమిటీలో లోక్‌సభ నుంచి 15మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ స్పీకర్ ఆ కమిటీకి ఛైర్మన్‌ను నియమిస్తారు. అత్యంత ప్రాధ్యాన్యత కలిగిన ఈ కమిటీలో సభ్యునిగా తనను ఎంపిక చేసినందుకు సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.