సంబంధిత వార్తలు

స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ ఎమ్మెల్సీ సీటుకు జరుగబోతున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా సుభాష్ రెడ్డి పేరును ఈరోజు ఉదయం ప్రకటించారు. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది కనుక సుభాష్ రెడ్డి వెంటనే నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థలలో ఓటు హక్కు కలిగినవారిలో 90-95 శాతం మంది టిఆర్ఎస్‌కు చెందినవారే ఉన్నారు. కనుక టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కవిత చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమి ఖాయమనే భావించవచ్చు.