మండలి ఎన్నికలకు నామినేషన్ వేసిన కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత నేడు నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేశారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గంప గోవర్దన్, సురేందర్, శకీల్, బిగాల గణేశ్ గుప్తా తదితరులు ఆమెతో పాటు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె నిజామాబాద్‌ కలక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నిజామాబాద్‌లోని స్థానిక సంస్థలలో 65 శాతం మంది సభ్యులు టిఆర్ఎస్‌కు చెందినవారే ఉన్నందున ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే.