హైదరాబాద్‌ శివార్లలో భారీ ప్రేలుడు

హైదరాబాద్‌ శివార్లలో శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో గల కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని ఓ చెత్తకుప్పలో శనివారం ఉదయం భారీ ప్రేలుడు జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ వెంటనే అక్కడకు చేరుకొని ఘటనస్థలం..దాని పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ప్రేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ళ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. చెత్తకుప్పలో ఏదైనా రసాయన పదార్దం పడేయడం వలన ప్రేలుడు జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేలుడు జరిగిన సమయానికి సమీపంలో ఎవరూ లేకపోవడం వలన ప్రాణనష్టం జరుగలేదు. కానీ చుట్టుపక్కల ఇళ్ళ కిటికీ అద్దాలు పగిలిపోయేంతగా భారీ విస్పోటనం జరగడం సాధారణమైన ప్రేలుడుగా భావించలేము. పోలీసుల దర్యాప్తులో ప్రేలుడుకు కారణాలు తెలుస్తాయి.