హైదరాబాద్‌ మెట్రోకు మూడు అవార్డులు

నవంబర్ 2017లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతీ ఏటా ఏదో ఓ అవార్డు అందుకొంటూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్&టి సంస్థ ప్రజాసంబంధాల విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు మూడు జాతీయస్థాయి అవార్డులను అందుకొంది. ఇటీవల బెంగళూరులో జరిగిన పీఆర్‌సీఐ గ్లోబల్‌ కమ్యునికేషన్స్‌ సదస్సులో హైదరాబాద్‌ మెట్రో ఎల్&టి సంస్థ తరపున ఎండీ, సీఈఓ కెవిబి రెడ్డి పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీఆర్‌సీఐ) ప్రధానం చేసిన ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హైదరాబాద్‌ మెట్రో ప్రారంభించినప్పటి నుంచి నానాటికీ ప్రజధారణ పెరుగుతూనే ఉంది. ప్రజల ఆదరణపొందడానికి మేము చేసిన కృషికి ఈ పీఆర్‌సీఐ అవార్డులు గుర్తింపుగా భావిస్తున్నాము,” అని అన్నారు.