
తెలంగాణ రైతులకు ఓ శుభవార్త! మార్చి నెలాఖరులోగా రూ.25,000 లోపు పంటరుణాలకు రైతులకే చెక్కులు పంపిణీ చేయబోతోందని ఆర్ధికమంత్రి హరీష్‌రావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా రైతులకు చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో 5.86 లక్షల మంది రైతులు రూ.25,000 లోపు పంటరుణాలు తీసుకున్నారని వారందరికీ త్వరలోనే చెక్కులు అందజేస్తామని తెలిఓపారు.
లక్ష రూపాయల లోపు పంటరుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలవారీగా రైతుల రుణవివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలు, నిధులు విడుదల చేసిన తరువాత వాటి ఆధారంగా రైతుల ఖాతాలలో నగదు జామా అవుతుంది. బహుశః మరో రెండు మూడు నెలలలో ఈ ప్రక్రియ పూర్తవవచ్చునని సమాచారం.