
శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్ధికమంత్రి హరీష్‌రావు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కనుక దానికి ఆమోదం తెలిపేందుకే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ధికమాంద్యం, నిధుల కొరత కారణంగా ఈసారి బడ్జెట్‌ను వాస్తవిక ఆదాయం, అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు జోరుగానే సాగుతున్నప్పటికీ, రైతుబందు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కొన్ని సంక్షేమ పధకాలకు సకాలంలో నిధులు విడుదలవడం లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. టిఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిపైనే అవుతోంది కానీ ఇంతవరకు నిరుద్యోగభృతి, పంటరుణాల మాఫీ హామీలను అమలుచేయలేదు. కనుక ఈసారైనా బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయిస్తారో లేదో చూడాలి.