సచివాలయం కూల్చివేతపై తీర్పు రిజర్వ్

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం కూల్చివేసి దాని స్థానంలో రూ.400-500 కోట్లు వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించాలనుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావులు వేసిన పిటిషన్లపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ కేసుపై విచారణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. కనుక అంతవరకు సచివాలయం కూల్చివేతపై హైకోర్టు విధించిన స్టే కొనసాగుతుంది.