
నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్ గురువారం సాయంత్రం ఆ స్థానానికి ఉపఎన్నికలు షెడ్యూల్ జారీ చేసింది.
ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల: మార్చి 12
నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ: మార్చి 19
నామినేషన్ల పరిశీలన: మార్చి 20
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: మార్చి 23
పోలింగ్: ఏప్రిల్ 7 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 9
స్థానిక సంస్థలలో టిఆర్ఎస్‌దే పైచెయ్యి కలిగి ఉన్నందున ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అవలీలగానే విజయం సాధించడం ఖాయం. కనుక టిఆర్ఎస్ నుంచి ఎవరికి ఈ అవకాశం లభిస్తుందో చూడాలి.