తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ ప్రజలకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజల సమస్యలు, పిర్యాదులను పరిష్కరించేందుకు జాతీయ మానవహక్కుల కమీషన్ మార్చి 26వ తేదీన హైదరాబాద్‌ వస్తోంది. ఆరోజున హైదరాబాద్‌లో బహిరంగ విచారణ చేపట్టనుంది. 

రాష్ట్రంలో  షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలు ఎవరైనా ప్రభుత్వ అధికారుల తిరస్కారానికి గురైనా లేదా కులం కారణంగా అవమానించబడినా బాధితులు కమీషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కులవివక్ష కారణంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా వారు కమీషన్‌కు తెలియజేయవచ్చు. వాటిపై కమీషన్ విచారణ జరిపి, దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటుంది.భాధితులు తమ సమస్యలను, పిర్యాదులను రిజిస్టర్‌ పోస్టు లేదా ఈ మెయిల్‌/ ఫ్యాక్స్‌ ద్వారా మార్చి 13వ తేదీలోగా కమీషన్‌కు పంపించవలసి ఉంటుంది. 

జాతీయ మానవహక్కుల కమీషన్ చిరునామా: రిజిస్ట్రార్, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్, మానవ్‌ అధికార్‌ భవన్‌ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్‌ఏ, న్యూఢిల్లీ, 110023

ఈమెయిల్ అడ్రస్: nhrc@nic.in,  jrlawnhrc@nic.in 

ఫ్యాక్స్ నెంబర్లు: 011-24651332, 011-24651334 

మార్చి 13వ తేదీలోగా అందిన పిర్యాదులన్నిటిపై మార్చి26న  హైదరాబాద్‌లో బహిరంగ విచారణ జరుపుతామని తెలియజేసింది. కనుక రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలెవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.