ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు 11 ఏళ్ళు జైలు శిక్ష!

జ‌మాతుల్ ద‌వా ఉగ్రవాదసంస్థ అధినేత, హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిస్ట్ కోర్టు 11 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్ధికసాయం చేసినట్లు రుజువవడంతో ఈ శిక్ష విధించబడింది.

ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ఎంతో కాలంగా కోరుతోంది. కానీ అతను ఉగ్రవాద చర్యలకు పాల్పడిన సాక్ష్యాధారాలు లేవంటూ భారత్‌ అభ్యర్ధనను త్రోసిపుచ్చింది. ఇప్పుడు అతను ఉగ్రవాదసంస్థలకు నిధులు సమకూర్చుతున్నారని పాక్‌ న్యాయస్థానమే దృవీకరించింది. అంటే ఇంతకాలం అతని గురించి పాక్‌ ప్రభుత్వం చేస్తున్న వాదనలు అబద్దమని స్పష్టమైంది. భారత్‌కు పక్కలో బల్లెంలా ఉండే అతనిని పాక్‌ ప్రభుత్వం నిజంగా జైలుకు పంపిస్తుందనుకోలేము. బహుశః భారత్‌, అమెరికాలను మభ్యపెట్టేందుకే అతను జైలులో ఉన్నట్లు చూపించవచ్చు.