డిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీయే?

ఈరోజు ఉదయం నుంచి డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 70 స్థానాలకు 79 మంది మహిళలతో సహా 672 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం కాగా ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమ్ ఆద్మీ పార్టీ 53, బిజెపి 16, కాంగ్రెస్‌-1 నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కనుక సర్వేలు సూచించినట్లుగానే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12-1 గంటలోగా ఫలితాలపై పూర్తి స్పష్టత రావచ్చు.