సంబంధిత వార్తలు
తెలంగాణ సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎం.నారాయణ రెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహమ్మద్ అమీర్లను ఎంపిక చేసింది. ఆ జాబితాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపగా ఆమె దానికి ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదం తెలుపడంతో వారిని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమీషనర్‌గా రాజాసాదారం, బుద్దా మురళి కొనసాగుతున్నారు.