సంబంధిత వార్తలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం కేసీఆర్ నేడు మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఇవాళ్ళ మేడారంకు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు సిఎం కేసీఆర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరుతారు. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవి చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా మేడారం జాతరకు వస్తున్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ల పర్యటన సందర్భంగా అధికారులు మేడారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.