
అత్యంత ప్రజాధారణ పొందిన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు క్రమంగా నగరం నలువైపులా విస్తరిస్తున్నాయి. సిఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు ఎంజీబీఎస్-జెబిఎస్ కారిడార్‌లో మెట్రో సర్వీసులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మొత్తం 11 కిమీ పొడవున్న ఈ మార్గంలో పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ (కోఠి), ఎంజీబీఎస్ వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ నగరం మద్యన అత్యంతరద్దీగా ఉండే ప్రాంతాలు కనుక వాటిని కలుపుతూ నిర్మించిన ఈ మెట్రో మార్గం హైదరాబాద్‌వాసులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఈ ప్రారంభోత్స కార్యక్రమంలో సిఎం కేసీఆర్‌త్ పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, మెట్రో అధికారులు హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్‌లోని సంగీత్ జంక్షన్ నుంచి పెరేడ్ గ్రౌండ్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ్ళ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ విభాగం సిపి అనీల్ కుమార్ తెలిపారు.