
ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ దేశంలో మద్యతరగతి ప్రజలకు ఓ శుభవార్త వినిపించారు. వార్షికాదాయం రూ.2.5 లక్షలలోపు ఉన్నవారికి ఆదాయపన్ను మినహాయింపును కొనసాగిస్తూ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షికాదాయానికి కేవలం 5 శాతం మాత్రమే పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు.
రూ.5లక్షలకు మించి వార్షికాదాయంపై పన్నులు ఈవిధంగా ఉంటాయి...
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షలకుపైగా వార్షికాదాయం కలిగినవారికి 30 శాతం పన్ను.